top of page
Light Orange Gradient Live Life Daily Desktop Wallpaper.png

ABOUT:

శ్రీ భం పార్వతిమాత వారి 4వ ఏట శ్రీ భం షేక్ అబ్దుల్ స్వామి వారి వద్ద మంత్రోపదేశం పొందిరి. ఒకనాడు శివరాత్రి పర్వదినాన శ్రీ భం అన్వరానంద స్వామివారితో శ్రీ పార్వతీదేవి గారికి కల్యాణం జరిగినది. ఆశ్రమ బాధ్యతలను గురు ఆదేశాల మేరకు తు.చ తప్పకుండా త్రికర్ణ శుద్దిగా స్వామిగారు నిర్వర్తిస్తూ చేస్తున్న ప్రతీ సంఘటనను ఇంటికి రాగానే అమ్మవారితో సంపూర్ణంగా తెలియజేసేవారు.

అమ్మవారు ఏ కార్యం చేస్తున్నా ప్రతిక్షణం గురు ఇచ్చిన మంత్రాన్ని స్మరించేవారు. అటు పెద్ద స్వామిగారి, ఇటుఅన్వరు స్వామివారి గుప్త భోధనలచే అమ్మవారుస్వయంప్రకాశమును,సచ్చిదానందమును,శాశ్వితమైన స్వస్వరూపానుభవమును (తత్వమసి) పొందిరి.

 

శ్రీ గురుదేవులు దేహత్యాగం చేసి సన్నిధానం చేరాక, శిష్యభక్తాదులు గురుదిక్కులేని వారమయ్యామని  నిరాశపడుతుండగా, గురు ఆశయాలను, ఆధ్యాత్మిక  కార్యక్రమాలను ముందుకు సాగించేందుకు మాతాజీ తొలిసారిగా ఆశ్రమంలో శిష్యభక్తాదులకు అభయం ఇవ్వడంతో శిష్యభక్తాదులలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. కుటుంబాన్ని, కన్న బిడ్డలను ప్రక్కన పెట్టి గురు బిడ్డలైన శిష్యభక్తాదులను ఓదార్చేందుకు మాతాజీ ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాలలోని మారుమూల గ్రామాలను సైతం వదలకుండా అన్ని ప్రాంతాలను ఎంతో వ్యయప్రయాసకోర్చి జైత్రయాత్రలు చేసారు.

లోకంలో ఒక్కోక్క గురువు పరిపరి విధములుగా అవతరాన్ని చూపిస్తారు. శ్రీ పార్వతీమాత అవతారం ఎవరికి ఊహకు, జ్ఞానమునకు అంతుపట్టనిది. అమ్మవారు చాలా గోప్యముగా ఎన్నో బీద కుటుంబాలకు ఆరోగ్య రీత్యా అన్నీ రోగములకు ఆయుర్వేద మందులను తయారీ చేసి పంపేవారు. అంతేకాకుండా ఆ కారుణామయి నిరుపేదలకు ఎన్నో మార్లు ధనాన్ని కూడా గోప్యముగా అందచేసినారు.

శ్రీ పార్వతీదేవి వారి అవతారము లౌకికులకు లౌకికంగాను, అధ్యాత్మికులకు అధ్యాత్మికంగాను కనిపించుచుండెను.

 శ్రీ పార్వతీదేవి వారి మహిమలు అనంతమైనవి. స్వామివారి వద్ద మంత్రోపదేశమును పొంది మరల అమ్మవారి దగ్గరకు మంత్రోపదేశము కొరకు పోయినవారికి అదే మంత్రమును ఉపదేశం చేసినారు. అలా ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఎన్నో మహిమలు ఉన్నవి.

ధర్మపత్నిగా, తల్లిగా, పీఠాధిపతిగా శ్రీ పార్వతీదేవి గారు గురుదేవుల ఆజ్ఞతో వారి అవతరమును, వారి బాధ్యతలను సద్గురువుగా వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. 2018 విక్రమ నామ సంవత్సరం బహుళ పక్షంలో సప్తమి తిదినాడు శతభిష నక్షత్రంలో జూన్ 8వ తేదీన శ్రీ పార్వతీదేవి గారు శివైక్యం చెందారు.

అతి పిన్న వయసులోనే గురుఉపదేశం పొందిన మాతాజీ:

4 సం॥ల వయస్సులో భం షేక్ అబ్దుల్ స్వాములవారితో మాతాజీ.

పూజ్య శ్రీ మాతాజి గారు అతి పిన్న వయసు 4వ ఏటనే శ్రీశ్రీశ్రీ భం భం బాబా షేక్అబ్దుల్ స్వాముల వద్ద ఉపదేశం పొంది కారణ జన్ములయ్యారు. నాటినుండే గురుదేవుల సంకల్పంతో గురు ఆశీస్సులతో నే ఎదిగారు. పూర్వ జన్మ సుకృతంతో జన్మతహ గురుప్రేరణ తోనే మాతాజీ జీవితం ఆద్యంతం సాగింది.

పసితనం నుండే గురుదేవుల సంరక్షణలొ ఎంతో చలాకిగా అందరిని ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక భావాలతో ఎదిగిన మాతాజి యుక్త వయస్సు రాగానే  శ్రీశ్రీశ్రీ షేక్ అబ్దుల్ సాములవారు కారణ జన్మలైన తన కుమారుడు ఉస్మాన్ బాష అలియాస్ శ్రీశ్రీశ్రీ సద్గురు అన్వరానంద బాబాతో వివాహం జరిపించి కోడలుగా ఆధ్యాత్మిక  వారసురాలుగా చేసుకున్నారు.

Pretty Light Pink Watercolour For Instagram Story.png

పూజ్యశ్రీ మాతాజీ గారి జైత్రయాత్ర:

పూజ్యశ్రీ మాతాజీ గారి జైత్రయాత్ర మనిషికి కష్టాలు వస్తే దేవుడి గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టి తన కష్టాలు తీర్చమని, మానసికశాంతి కల్గించాలని వేడుకుంటాడు. దేవుడు మాట్టాడడు కాబట్టి కొందరు సద్గురువులను ఆశ్రయించి తమ కష్టాలకు నివారణోపాయాల కోసం అభ్యర్ధనలతో ప్రాధేయపడుతుంటారు. అయితే మనిషి తన జీవనగమనంలో అనుసరిస్తున్న విధానాలను, మానసిక ఆంధోళనకు కారణం అవుతున్న విషాయలను సమీక్షించుకునేందుకు ప్రయత్నించడు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించినప్పటికీ మానసిక శాంతికి దూరంగానే ఉంటూ తన ఖర్మసిద్దాంతాలలో తృప్తిపడుతుంటాడు.

అందుకే మనిషిని పట్టిపీడిస్తూ, కుటుంబంలో అశాంతికి కారణమై భార్యభర్తల మధ్య అనేక సమస్యలకు కారణం అవుతున్న దుర్వ్యసనాలను సమూలంగా నిర్మూలించేందుకు పూజ్యశ్రీ మాతాజీ గారు కంకణం కట్టుకుని  ఆధ్యాత్మిక జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు.

 

పూజ్యశ్రీ మాతాజీ గారిని ఆహ్వానించి తమ గృహాలను పావనం చేసుకుని, మాతాజీగారి పాదరస్పర్శతో పునీతులు కావాలని అభిలషించే శిష్యభక్తాదులు జీవితకాలంలో మద్యం సేవించడం, మాంసం భుజించడం,పొగత్రాగడం  లాంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రమాణ పూర్వకంగా అంగీకరించాలని నిబంధన విధించారు. మాతాజీ తమ ఇంటికి రాలేని ఈ దుర్వ్యసనాలు వదలివేయడం కష్టం కాదని నమ్మిన భక్తులు ఎందరో ముందుకు వచ్చి మాతాజీగారు తమ ఇంటికి ఆహ్వానించడంవిశేషం. భయంతో సాధించలేని దానిని భక్తితో సాధించవచ్చని మాతాజీ గారునిరూపించారు.

ఈ ఆధ్యాత్మిక జైత్రయాత్ర ఆంధ్ర, కర్నాటక ప్రాంతాలలోని వివిధ గ్రామాల్లో నిరవధికంగా,నిరాఘాటంగా మండుటెండటలను, వర్షాలను కూడా లెక్క చేయకుండా అశేష భక్తజనుల ఆదరాభిమానాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో సాగించారు. గ్రామ, గ్రామాన ఊరేగింపులు, ఇంటింటా పాదపూజలతో ఎంతో నిరాడంబరంగా సాగింది. ప్రధానంగా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు మాతాజీగారిని ఆహ్వానించి దుర్వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

 

ఈ జైత్రయాత్రలో శ్రీ సద్గురు శ్రీ బాబా అన్వరానందస్వామిపై అచంచల భక్తి విశ్వాసాలు, పూజ్యశ్రీ మాతాజీగారి ఆశీసులపై అపార నమ్మకం కల్గిన ఎందరో శిష్యభక్తాదులు తమ జీవితాలనుచక్కదిద్దుకునేందుకు సిద్ధపడ్డారు.

మాతాజీ అనుసరించినఈ విధానం భక్తులనే కాకుండా ఎందరెందరో భక్తులు కానివారు కూడా హర్షించి,జీవితాలలో ఆనందపు వెలుగులు నింపేందుకుమాతాజీ గారి  ప్రయత్నాన్ని అభినందించడం విశేషం.

మాతాజీ పర్వటనలో అద్భుతాలు:

077_ccexpress.png

పూజ్యశ్రీ మాతాజీగారు సాగించిన జైత్రమాత్రలో అనేక గ్రామాల్లో ఎన్నో అద్భుతాలు అందరినీ అకట్టుకున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా భక్తులు ఏర్పాటు చేసిన ఎద్దుల బండ్లలోనూ, ట్రక్టర్లలోనూ మాతాజీ గంటల తరబడి కూర్యుని ఊరేగింపు కార్యక్రమాల్లో ఎలాంటి అలసట లేకుండా పాల్గొన్నారు. మే నెలలో బగబగ మండే సూర్యుని తాకిడి చల్లినివెన్నెల్లాగా మాతాజీగారు అనుభవించారు. అంతేకాకుండా వర్షానికి నోచుకోని గ్రామాల్లో మాతాజీ గారు అడుగు పెట్లగానే వర్షాలతో స్వాగతం పలకడం లాంటి సంఘటనలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

 

ఉదాహరణకు కుందుర్పి మండలం, ఎస్.మల్లాపురం గ్రామంలో పర్యటన కోసం మాతాజీగారు మే 29వ తేది, 2005 న ఆ గ్రామాన్ని చేరుకున్నారు. అంతవరకు ఎండలు మండుతుండగా ఆకాశంలో ఒక చిన్నమబ్బు మేఘం మినహాయించి ఆకాశమంతా నీలివర్ణంతో ఎంతో ప్రశాంతంగా ఉంది. అయితే మాతాజీ గారు అక్కడికి రాగానే ఆ చిన్నమేఘం చినుకులు రాల్చుతూ మాతాజీ గారికి స్వాగతం పలుకగా, క్షణాల్లో  నీలి ఆకాశమంతా నల్లడి మబ్బు మేఘాలుగా రూపుదాల్చి వర్షం జోరుగా ఊపందుకుంది. మాతాజీ గారిని ఆహ్వానించేందుకు వచ్చిన భక్తులు, జనం అంతా చెట్ల కిందకు పరుగులు తీసి తలదాచుకున్నారు. మాతాజీ గారి కోసం ఏర్పాటు చేసిన ఊరేగింపు వాహనం తడిసి ముద్దయింది. కొంతసేపటికి మాతాజీగారి కనుచూపుతో శాంతించిన మేఘం కార్యక్రమం నిర్వహణ కోసమా అన్నట్లు వర్షం ఆగిపోయింది. అనంతరం ఎస్. మల్లాపురం తాండాకు చెందిన భక్తులు మాతాజీ గారిని సాధరంగా ఆహ్వానించి, నారాయణ నాయక్ అనే భక్తుడు దానంగా ఇచ్చిన భవనంలో ఏర్పాటు చేసిన భజన మందిరాన్ని మాతాజీ గారు ప్రారంభోత్సవం చేసారు.

 

తాండా నుండి కళ్యాణదుర్గంకు కారులో బయలుదేరిన మాతాజీ వాహనం దోవతప్పిపోయి మార్గమధ్యంలో ఒక వంకవద్ద ఆగిపోయింది. కారుడ్రైవరుగా వచ్చిన వ్యక్తికి ఆ ప్రాంతం కొత్తది కావడంతో ఎలా వెళ్లాలో అర్థం కాక చతికిలబడి పోయాడు. అయితే ఆ సమయంలో కారు ముందు ఒక జ్యోతి వర్షంలో లైటులాగా అగుపించి త్రోవ చూపడంతో ముందు ఒక వాహనం వెళుతున్నట్లుగా భావించి దానివెనుకాలే వెళ్ళి కళ్యాణదుర్గం చేరుకొన్నారు. అనంతరం తమకు త్రోవచూపిన వాహనం అదృశ్యం అయినట్లు తెలుసుకున్నారు. సాక్షాత్తు పూజ్య గురుదేవులే వచ్చి ఆదుకున్నట్లు భక్తులు కొనియాడారు. ఇది ఇలా ఉండగా మాతాజీ వెంట ఫాలో అయిన కొన్ని తప్పిపోయిన కార్లు, జీవులు తెల్లవారుజామున చేరుకున్నాయి.

కుందుర్పి మండలం ఎస్. మల్లాపురం తాండాలో మాతాజీగారి వెంట సేవకు వచ్చిన లక్ష్మీబాయ్ అనే భక్తురాలికి వర్షంలో తడుస్తుండగా ఓ మూలనుండి వచ్చిన ఓ నల్లటి తేలు కుడికాలి బొటనవ్రేలికి కాటు వేసింది.అయితే ఈ విషయాన్ని ఆమె గమనించలోపునే మాతాజీగారి దృష్టికెళ్లింది. అయితే కాటు వేయించుకున్న బాధితురాలికి ఏ మాత్రం బాధ కలుగకుండా ఆ రాత్రంతా గడిపేసారు. ఉదయాన్నే మాతాజీగారి పాదసేవకు ఉపక్రమించగా మాతాజీగారి కుడికాలు బొటనవ్రేలుకు కాటు ఉండటాన్ని గమనించారు. ఆరా తీస్తే తన భక్తురాలు లక్ష్మీబాయ్క తేలు వేసిన కాటును మాతాజీ గారు సంగ్రహించి ఆ కాటు బాధనంతా మాతాజీ గారు అనుభవించినట్లు తెలుసుకుని అందరు సంభ్రమాశ్చర్యాలతో అబ్బురపోయారు.

 

మాతాజీగారు పేరూరు ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో కొందరు మావోయిస్టులుగా భావిస్తున్న వ్యక్తులు పూజ్యశ్రీ మాతాజీ గారిని పరీక్షించేందుకు కాలకూట విషాన్ని ఇచ్చారు. మాతాజీ గారు సవాలుగా తీసుకుని ఆ విషాన్ని గుటగుట తాగేసి జైత్రయాత్రకు బయలుదేరారు. ఆ రోజంతా మరెంతోఆనందంగా మాతాజీ గారు వివిధ గ్రామాల్లో పర్యటించి రాత్రి బసకోసం పేరూరు చేరుకున్నారు. మాతాజీ ఆధ్యాత్మికశక్తిని పరిశీలించేందుకు ప్రయత్నించిన వ్యక్తులు మాతాజీ వెంటే ఉండి సమీక్షించారు. అయితే ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా మాతాజీ గారు చిరునవ్వులు చిందిస్తున్న మాతాజీ గారిని చూసి విషమిచ్చినవారు విస్తుపోయారు. అనంతరం మాతాజీ గారిని శరణుజొచ్చి భక్తులుగా మారడంవిశేషం.

 

అంతేకాకుండా పేరూరు సమీపంలో మాతాజీ గారు పర్యటిస్తుండగా అచ్చంపల్లి అనే గ్రామంలో కొందరు గ్రామదేవతలు వచ్చి కొన్ని సంవత్సరాలుగా తమకు పూజలు జరగడం లేదని, తమకు విముక్తి కలిగించాలని మాతాజీ గారిని  శరణుజొచ్చారు. ఈ విషయాన్ని మాతాజీ ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను సమావేశపరచి గ్రామదేవదల అంశాన్ని సమీక్షించారు. అచ్చంపల్లి గ్రామానికి కిలోమీటరు దూరంలో గ్రామదేవతల దేవాలయం ఉందని గ్రామస్థులు వివరించారు. వారికి కొన్ని సంవత్సరాలుగా పూజలు జరగడం లేదన్ని అంశాన్నిపరిశీలించారు.

 

మాతాజీగా స్వయంగా దగ్గరుండి ఆ గ్రామదేవతలకు గ్రామస్థుల | సమక్షంలో పూజలు చేయించారు. ఈ గ్రామదేవతలు సాత్విక గుణం శ్రీ కలవారైనందున జంతుబలులను కోరరని, ఇకపై క్రమం తప్పకుండా పూజలు నిర్వహించాలని గ్రామస్థులకు వివరించారు. అనంతరం గ్రామంలో వర్షం కురవడంతో ఆ గ్రామంలోని ప్రజల ఆనందాలకు అవధుల్లేకుండాపోయాయి. ఇలా ఎన్నో మరెన్నో అద్భుతాలు మాతాజీ ఆధ్యాత్మిక జైత్రయాత్రలో చోటు చేసుకున్నాయి. మాతాజీగారి జైత్రయాత్ర మొత్తం భక్తి, పారవశ్యాలతో పాల్గొన్న భక్తులు ఈ అద్భుతాలు ప్రత్యక్షంగా తిలకించి తరించారు.

bottom of page